బోటు ప్రమాదంలో 6 మృతదేహాలు గుర్తింపు

ప్రమాదం జరిగిన 38 రోజుల తర్వాత గోదావరి నది నుంచి రాయల్ వశిష్ట బోటను వెలికి తీశారు. పడవలో 8 డెడ్‌బాడీస్ ఉన్నట్లు తేల్చారు. వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఒంటిపై దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా 6 మృతదేహాలను గుర్తించారు. ఇన్నిరోజులు నీళ్లలోనే ఉండిపోవడంతో మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కుళ్లిపోయాయి. అందుకే గుర్తించడం చాలా కష్టంఅవుతోంది. ఇంకా 2 మృతదేహాలను గుర్తుపట్టాల్సి ఉంది. ఇందులో ఒక మృతదేహానికి కేవలం మొండం మాత్రమే ఉంది..దీంతో అది ఎవరిదన్నది తేలడం లేదు. ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత కాస్త క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటికీ గుర్తించకపోతే..DNA టెస్టులు చేసే అవకాశం ఉంది.

ఆధార్ కార్డుల ఆధారంగా వరంగల్‌ జిల్లా కడిపికొండకు చెందిన కొమ్ముల రవి, ధర్మరాజు మృతదేహాలను గుర్తించారు. నల్గొండకు చెందిన సురభి రవీందర్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మణికంఠ, రాయల్ వశిష్ట బోటు డ్రైవర్ సంగాడి నూకరాజు,అసిస్టెంట్ డ్రైవర్ పోతవరపు సత్యనారాయణ మృతదేహాలను కూడా ఐడెంటిఫై చేశారు. మిగతా రెండు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు..

ఈ ప్రమాదంలో గల్లంతైన మంచిర్యాల జిల్లా .. నన్నూరుకు చెందిన రమ్యశ్రీ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాజమండ్రి ఆస్పత్రి వద్దే పడిగాపులు పడుతున్నారు. తమ కూతురిని తలచుకొని విలపిస్తున్నారు. అటు వరంగల్ జిల్లా కడిపికొండ గ్రామంలోని పడవ ప్రమాద బాధితుల గోడు వర్ణనాతీతంగా ఉంది. మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి..

77 మందితో పాపికొండల విహారయాత్రకు బయల్దేరిన రాయల్ వశిష్టబోటు..సెప్టెంబర్‌15న కచ్చులూరు మందం దగ్గర గోదావరిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. 51మంది జలసమాధి అయ్యారు.ఇప్పటి వరకు 46 మృతదేహాలు లభ్యం అయ్యాయి. మరో ఐదు డెడ్‌బాడీలు దొరకాల్సి ఉంది..

అటు ప్రమాదం జరిగిన కచ్చులూరు వద్ద రాయల్ వశిష్ట బోటను క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులు.. పడవలోపల ఉన్న ఎముకలను సేకరించారు..ఈ ఎముకల DNA సేకరించడం ద్వారా అవి ఎవరి మృతదేహాలో గుర్తించనున్నారు.. అటు బోటును వెలికితీసిన ధర్మాడి సత్యాన్ని సన్మానించిన కలెక్టర్ మురళీదర్‌ రెడ్డి..20 లక్షల చెక్‌ను అందజేశారు.

Tags

Next Story