రాజధానిని ఎక్కడికి తరలిస్తున్నారు : నారా లోకేశ్

రాజధానిని ఎక్కడికి తరలిస్తున్నారు : నారా లోకేశ్
X

ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్..అమరావతిపై జగన్ వైఖరేంటో తెలియక...వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతూ..ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని అన్నారు. ఏదైనా ఊరికి దుష్టశక్తి ఆవహించినపుడు చెట్లు మాడిపోవడం, ప్రజలు ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోవడం కథల్లో వింటుంటాం. అమరావతి విషయంలోనూ అదే జరిగిందేమో అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. అమరావతి నిర్మాణానికి మీ దగ్గర ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? లేక రాజధానిని ఇంకెక్కడికైనా తరలిస్తున్నారా? అంటూ జగన్‌ను ప్రశ్నించారు లోకేశ్.

Tags

Next Story