ఏ నూనెతో దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం..

ఏ నూనెతో దీపారాధన చేస్తే అమ్మవారి అనుగ్రహం..
X

deepavali

దీప కాంతులు వెదజల్లే లోగిళ్లు.. ఆనందాల హరివిల్లు.. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఆ ఇంట వెల్లి విరుస్తాయి. వెలుగులు పంచే దీపావళి రోజు మొదలు కార్తీక మాసం నెలరోజులు దీపారాధన చేస్తుంటారు మహిళలు. దీపారాధనకు ఉపయోగించే నువ్వుల నూనెలో ఆవునెయ్యి, వేపనూనె కలిపి దీపారాధన చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ నూనెతో పరమ శివుని ముందు దీపారాధన చేస్తే విజయం ప్రాప్తిస్తుంది. నువ్వుల నూనెతో దీపారాధనను సకల దేవతలు ఇష్టపడతారు. దుష్పలితాలను దూరం చేసి సకలశుభాలను ఇస్తుంది. వినాయకుని పూజించేటప్పుడు కొబ్బరి నూనె వాడడం శ్రేయస్కరం. వేరుశనగ నూనెను మాత్రం దీపారాధనకు వాడకపోవడమే మంచిది.

దీపాలు వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకుండా అగరొత్తులను వెలిగించి వాటితో వెలిగించాలి. ఆవునెయ్యితో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టకరం. ఆవు నెయ్యిలో సూర్యశక్తి ఉంటుంది. ఈ నేతితో దీపారాధన చేస్తే ఆరోగ్య, ఐశ్వర్య, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఇక ఆముదంతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కొనసాగుతుంది. వెండి, మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. రోజూ దీపారాధన చేసేవారు వెండి కుందుల్లో చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కుందుల క్రింద తమల పాకు కానీ, చిన్న ప్లేట్ కానీ ఉంచి దీపాలు వెలిగించాలి. క్రమం తప్పకుండా 41 రోజుల పాటు దేవుని ముందు దీపారాధన చేస్తే మనసులో ఉన్న కోరికలు నేరవేరుతాయని పండితుల ఉవాచ.

Next Story