దారుణం : రజకులను గ్రామ బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలు

కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌లో దారుణం జరిగింది. గోనెగండ్ల మండలం వేముగోడులో గ్రామ పెద్దలు రజకులను గ్రామ బహిష్కరణ చేయడం కలకలం రేపుతోంది. రజకులు బట్టలు ఉతకకపోతే గ్రామం విడిచి వెళ్లాలంటూ పెద్దలు హెచ్చరికలు జారీచేశారు. దీంతో న్యాయం కోసం రజకులు పోలీసులను ఆశ్రయించారు. తమను బట్టలు ఉతకాలంటూ రోజు ఒత్తిడి చేస్తున్నారని.. ఊరెళ్లిపోవాలని బెదరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story