25 Oct 2019 6:16 AM GMT

Home
 / 
క్రీడలు / టీమిండియా కెప్టెన్,...

టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ తో సమావేశమైన గంగూలీ

టీమిండియా కెప్టెన్, వైస్ కెప్టెన్ తో సమావేశమైన గంగూలీ
X

BCCI అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. మార్పును చూస్తారంటూ ప్రకటించిన దాదా అప్పుడే టీంఇండియా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో సమావేశమయ్యారు. భారత క్రికెట్ భవిష్యత్తు కార్యచరణ గురించి వారితో చర్చించారు. అటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న ధోని రిటైర్మెంట్ గురించి కూడా వీరు మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. బిసిసిఐ కార్యదర్శి జై షా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సెలక్షన్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు బిసిసిఐ వర్గాలు చెబుతున్నాయి. భారత క్రికెట్ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు.. ఆదరణ తగ్గకుండా ఏం చేయాలనే దానిపై సమాలోచనలు జరిపినట్టు తెలుస్తుంది. IPLలో మార్పులు... యువక్రికెటర్లకు గుర్తించడంతో కోసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తీసుకోవాల్సిన చర్యలపై వీరు కొన్ని సూచనలు చేసినట్టు చెబుతున్నారు.

అటు బంగ్లాదేశ్ తో జరగనున్న సిరిస్ కు కూడా ఆటగాళ్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. సుదీర్ఘ కాలంగా గ్యాప్ లేకుండా ఆడుతున్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాకు టి20 మ్యాచ్ లకు విశ్రాంతినిచ్చారు. కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్, ఛాహల్ మళ్లీ జట్టులోకి వచ్చారు. కొత్త వికెట్ కీపర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పంత్, సంజూ శాంసన్ లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ధోనీ కూడా కొత్త ఆటగాళ్లకు మద్దతు తెలిపారన్నారు. రిటైర్మెంట్ ప్రకటించడమనేది ధోనికి సంబంధించిన వ్యక్తిగత అంశమన్నారు.

Next Story