శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న నదులు
X

శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు నాగావళి, వంశధార, బహుదా నదులు ఉప్పొంగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వాగులు, గడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలుచోట్ల రవాణావ్యవస్థ స్తంభించింది. వంశధార వరదపోటుతో గొట్టా బ్యారేజ్‌కి 80వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. నాగావళి వరద కారణంగా నారాయణపురం ఆనకట్టకు 45 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో పోటెత్తుతోంది. శ్రీకాకుళం ఓల్డ్ బ్రిడ్జ్ వద్ద ఔట్‌ఫ్లో 45 వేల క్యూసెక్కులు ఉంది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ కూడా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది. పాలకొండ, రాజాం పట్టణాలు ఇప్పటికే వరద ముంపుతో ఇబ్బంది పడుతున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు.

Tags

Next Story