గుడిసెలో దూరి స్మార్ట్‌ ఫోన్‌ దోచుకున్న దొంగలు

గుడిసెలో దూరి స్మార్ట్‌ ఫోన్‌ దోచుకున్న దొంగలు

theft

హైదరాబాద్‌ హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కంట్లూరు గ్రామంలో చోరీ జరిగింది. యాగ్నిక వేదపాఠశాలలోని కిషోర్ స్వామి ఇంట్లో దొంగలు పడ్డారు. 7 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత సమీపంలోని తాళాలు వేసిన ఇంటినీ దోచుకున్నారు. ఆ ఇంట్లో 5 తులాల బంగారం, 45 వేల నగదు దోచుకెళ్లారు.

2 ఇళ్లలో వరుస దొంగతనాల తర్వాత.. ఓ గుడిసెలో దూరి స్మార్ట్‌ ఫోన్‌ దోచుకున్నారు దొంగలు. దోపిడీ తర్వాత వాళ్లంతా అంబర్‌పేట్‌ వైపు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలు కోసం గాలిస్తున్నామని ఎల్‌.బి.నగర్‌ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story