నగరవాసికి నవంబర్ నెల గుడ్ న్యూస్..

నగరవాసికి నవంబర్ నెల గుడ్ న్యూస్..
X

Metro

మెట్రో వచ్చాక ప్రయాణం కాస్త సులువుగా ఉంది. బస్సుల కోసం వెయిట్ చేసి.. ఒక వేళ వచ్చినా కూర్చోడానికి సీటు ఉండక నానా ఇబ్బందులు పడుతున్న నగరవాసికి మెట్రో ఓ వరం లాంటిదే అని చెప్పాలి. మెట్రోలో నుంచున్నా ఇబ్బంది అనిపించదు. ట్రాఫిక్ జామ్‌లు ఉండవు, వెయిటింగ్ ఉండదు. అందుకే ఇల్లు దూరమైనా ఇబ్బందిలేకుండా వెళ్లి వస్తున్నారు. సొంత వాహనాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి మెట్రో ఎక్కడానికే మక్కువ చూపుతున్నారు.

నవంబర్ నెల నుంచి జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైల్ పరుగులు పెట్టనుంది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేస్తే ఈ రూట్లలో మెట్రో సేవలు ప్రారంభం అవుతాయి. జుబ్లీ బస్ స్టేషన్ నుండి పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్ వరకు మెట్రో సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ రూట్‌లో మెట్రో నడిస్తే హైదరాబాద్ వాసులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్టీసీ సమ్మెతో మెట్రోలో ప్రయాణించే వారికి సంఖ్య ఎక్కువైంది. ఎక్కువ మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డులు సృష్టిస్తోంది.

Next Story