ఖైదీ రివ్యూ

ఖైదీ రివ్యూ

kaidi

నటీనటులు : కార్తి , నరేన్ కుమార్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి తదితరులు

సంగీతం : సామ్ సి.ఎస్

ఛాయాగ్రహణం : సత్యన్ సూర్యన్

నిర్మాతలు : ఎస్.ఆర్.ప్రభు - రాధామోహన్

దర్శకత్వం : లోకేష్ కనకరాజ్

కార్తిక్ తెలుగు లో మంచి గుర్తింపే ఉంది. కానీ అతని స్టార్ డమ్ ని పెంచే హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఖైదీతో మరోసారి తన సత్తా చాటేందుకు ఖైదీ గా వచ్చాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా ఖైదీ ఎంత వరకూ ఎంటర్ టైన్ చేసాడో చూద్దాం.

కథ:

ఢిల్లీ(కార్తీ) హాత్యానేరం మీద పదేళ్లు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన వ్యక్తి. తన కూతురు మోహం ఎలా ఉంటుందో కూడా తెలియని అతను ఒక పోలీస్ ఆపరేషన్ కి సహాయం చేయాల్సి వస్తుంది. తన జీవితం ప్రమాదంలో పడుతుంది. యాభైకి పైగా పోలీసులను రక్షించే బాద్యత తీసుకుంటాడు. వందలకు పైగా కరుడు గట్టిన నేరస్థులు వెంటాడుతుంటే, అపస్మారక స్థితిలో పడిన పోలీసులు కాపాడేందుకు ఒక ఖైదీ చేసిన యుద్దం ఎలా ముగిసింది అనేది మిగిలిన కథ.

కథనం:

కార్తీ యాక్టింగ్ ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ గా ఉండదు.. ఇలాంటి నేచురల్ క్యారెక్టర్స్ ని ఫరెఫెక్ట్ గా సూట్ అయ్యే అతన ప్రతిభ డిల్లీ పాత్రకు ప్రాణం పోసింది. ఎక్కడా కూడా కమర్షియల్ లెక్కలు కనపడని ఈ కథను ఎంచుకొని ఆ పాత్రకు ప్రాణం పోయడంలో కార్తీ పూర్తి విజయం సాధించాడు. యాక్షన్ కి ఎమోషన్ ని జోడించడం లో దర్శకుడు లోకేష్ కనకరాజ్ ప్రతిభకు చప్పట్లు కొట్టకుండా ఉండలేం. సినిమా నిండా ఫైట్స్ ఉన్నా అవి బోర్ కొట్టలేదు. ఈ బాదుడేంటి అనిపించలేదంటే ఆ ఫైట్స్ మద్య దాగిన ఎమోషన్ కారణం. సినిమా మొదలైన తర్వాత ఏ సన్నివేశం కూడా అనవసరం అనిపించకుండా ఏ పాత్ర కూడా అలంకరణగా మిగలకుండా కథనం నడిపించ గలిగాడు. ఇదే ఖైదీ కి బలంగా మారింది. ఒక కానిస్టేబుల్ పాత్ర ను కూడా హీరో ఇమేజ్ తెచ్చేంత ప్రతిభ దర్శకుడిలో కనిపించింది. పోలీస్ కి ఖైదీ మద్య ఉండే రిలేషన్ ని చాలా రియలిస్టిక్ గా చూపించాడు దర్శకుడు. అలాగే వారి మద్య దూరం తగ్గించడానికి పడే సన్నివేశాలు కూడా చాలా కన్వీనెన్స్ గా చూపించాడు. ఈ పాత్రకు మరో నటుడ్ని ఊహించుకోలేనంతగా కార్తి మెప్పించాడు. ఒక ఖైదీ కుండే తెగింపు, వారికుండే ఫ్యామిలీ ఏమెషన్స్ ని కథలో సన్నివేశాలుగా మలచకుండా నటుల మాటలలో అంత ఇంపాక్ట్ ని తెప్పించగలిగాడు. యాక్షన్ సన్నివేశాలకుండే ఫార్మెట్ ని ఖైదీ పూర్తిగా మార్చాడు. పోలీస్ స్టేషన్ లో చిక్కుకున్న నలుగురకు కుర్రాళ్ళు ఒక కాని స్టేబుల్ తో కలసి పదుల సంఖ్యలో ఉన్న రౌడీలను ఎలా ఎదుర్కున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. వారిని కన్ ఫ్యూజ్ చేసేందుకు వారు సౌండ్ సిస్టమ్ ని వాడే సన్నివేశం చూస్తే దర్శకుడు ఆలోచనకు శహాభాష్ అనాల్సిందే.. అలాంటి సన్నివేశాలతో అడుగడుగాన సర్ ప్రైజ్ లతో ఖైదీ చేసిన ఆ నాలుగు గంటల ప్రయాణం ఊపిరి సలపనివ్వలేదు. కథలను, బ్యాక్ డ్రాప్ లను ఎంచుకునేందుకు దర్శకులు ఆలోచనల పరిధులు ఎలా పెంచుకోవచ్చో... ఖైదీ ఒక పర్ పెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తుంది. ఎంచుకున్న కథను ఎక్కడా దారి మళ్లించకుండా ఆ దారిలోని అన్ని ఎమోషన్స్ ని మిక్స్ చేసిన ఒక స్ట్రైట్ నేరేషన్ లో కథనం నడిపిన దర్శకుడికి అతని ఆలోచనకు బలంగా మారిన హీరో కార్తికి మెచ్చుకోవాలి. ఖైదీ డార్క్ యాక్షన్ థ్రిలర్ గా కొత్త ఎక్స్ పీరియన్స్ లను అందించింది.

చివరిగా:

ఖైదీ జర్నీ ఉత్కంఠంగా సాగింది. కార్తీ కెరియలో బెస్ట్ గా నిలుస్తుంది.

- కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story