కేసీఆర్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ - కిషన్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగ - కిషన్ రెడ్డి
X

kishan-vs-kcr

కార్మికుల పొట్టకొట్టమని మోదీ ఏ చట్టం చేయలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ మోటారు వాహనచట్టం చూపించి ఆర్టీసీ కార్మికులను బెదిరిస్తున్నారన్నారు. కేసీఆర్ కు ముందుంది ముసళ్ల పండగేనన్నారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Tags

Next Story