నాన్నా నేనూ.. ధోనీతో పాటు చిన్నారి జీవా

నాన్నా నేనూ.. ధోనీతో పాటు చిన్నారి జీవా
X

dhoni

మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కార్లు, బైకులంటే చాలా ఇష్టం. తన గ్యారేజీలో కార్ల కలెక్షన్ చాలానే ఉంటుంది. తాజాగా నిసాన్ జొంగాను గ్యారేజీలోకి తీసుకొచ్చాడు మిస్టర్ కూల్. దీపావళి సందర్భంగా ధోనీ.. జోంగాను క్లీన్ చేస్తుంటే చిన్నారి జీవా వచ్చి.. నాన్నా నేను క్లీన్ చేస్తా అంటూ తనూ ఓ స్పాంజి పట్టుకుంది. ఇద్దరూ క్లీనింగ్‌లో చాలా బిజీగా ఉన్న వీడియోను ధోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. పెద్ద పనికి చిన్న సాయం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది అని రాసి ధోనీ ఆ వీడియోని షేర్ చేశారు. షేర్ చేసిన గంటలోనే దాదాపు 7 లక్షల వ్యూస్ వచ్చాయి. వేలల్లో కామెంట్స్ వచ్చాయి. మేం కూడా సాయం చేస్తాం మిస్టర్ కూల్ అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. ధోనీ భార్య సాక్షి కూడా జీవా జొంగా కారుపై కూర్చుని ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. నిస్సాన్ జోంగాపై ధోనీ తన స్వస్థలం రాంచీపై చక్కర్లు కొట్టిన వార్త ఆ మధ్య సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఆ జీప్‌ను భారత సైన్యం కోసం ప్రత్యేకంగా తయారు చేయించింది కావడంతో ధోనీ దానిని వాడడం ఆపేసినట్లు తెలుస్తోంది.

Next Story