ఈవారం నష్టాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈవారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 240, నిఫ్టీ 78 పాయిట్లు నష్టపోయాయి. బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ళ మద్దతు లభించడంతో ఈవారం బ్యాంక్ నిఫ్టీ 276 పాయింట్లు లాభపడింది. ఈ వారం ప్రధాన షేర్లలో పవర్ గ్రిడ్ 15.12శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 7.27, ఐషర్ మోటార్స్ 5.57, ఎస్బీఐ 4.43 శాతం లాభంతో నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి. ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్ 19.65 శాతం, భారతి ఇన్ఫ్రాటెల్ 17.08, ఇన్ఫోసిస్ 16.96, టాటా మోటార్స్ 7.13 శాతం నష్టంతో ఈవారం నిఫ్టీ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
