బెంగళూరులో 60 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్

బెంగళూరులో 60 మంది బంగ్లాదేశీయులు అరెస్ట్
X

Untitled-1

కర్నాటకలోని బెంగళూరులో భారీగా బంగ్లాదేశీయులు అక్రమంగా నివసించడం కలకలం రేపింది. అనధికారికంగా నివసిస్తున్న 60 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రామ్మూర్తినగర్, బెల్లందూరు, మారధళ్లిలో అనధికారికంగా ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్నవారిలో 29 మంది పురుషులు, 22 మంది మహిళలు, 9 మంది యువతులు, పిల్లలు ఉన్నారు. బెంగళూరు నగర కమిషనర్ భాస్కరరావు ఆధ్వర్యంలో పోలీసు బలగాలు బంగ్లాదేశీయులను గుర్తించాయి. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? సిటీలో ఎంత కాలంగా నివసిస్తున్నారు? వీరిని ఎవరు తీసుకొచ్చారు? ఇలా అన్ని కోణాల్లో డీఎస్పీ కులదీప్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story