నేడు హుజూర్ నగర్ కు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ శనివారం హుజూర్ నగర్ వెళ్లనున్నారు. 40 వేల మెజారిటీతో విజయాన్ని అందించిన హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞత సభలో పొల్గొంటారు. సీఎం పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేశామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. లక్ష మందికి పైగా జనం సభకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టామని అధికారులు చెప్పారు.

నిజానికి ఎన్నికల ప్రచారం సమయంలోనే హుజుర్‌నగర్‌లో సీఎం కేసీఆర్ సభకు ప్లాన్ చేశారు గులాబీ నేతలు. కానీ, భారీ వర్షంతో ప్రచార సభ చివరి క్షణంలో రద్దయింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ప్రచారంలో పాల్గొన్నారు. అయినా..కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకునే హుజూర్ నగర్ లో 40 వేలకు పైగా మెజారిటీ ఇచ్చిన ప్రజలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపాలని నిర్ణయించుకున్నారు. దీంతో రద్దైన ప్రచార సభకు బదులు కృతజ్ఞత సభలో సీఎం పాల్గొంటున్నారు. ఇదే సభ వేదికగా..నియోజక అభివృద్ధి డిక్లరేషన్ ప్రకటించనున్నారు సీఎం.

Tags

Read MoreRead Less
Next Story