మద్యం అమ్మకాల్లో చేతివాటం..

మద్యం అమ్మకాల్లో చేతివాటం..
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీలో కొంతమంది సిబ్బంది అడ్డదారులు వెతుక్కుంటున్నారు. మద్యం అమ్మకాల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలోని మునగపాక గ్రామంలో ప్రభుత్వం మద్యం దుకాణం ఏర్పాటు చేసింది. అందులో చట్టవిరుద్ధంగా డిఫెన్స్‌ మద్యం విక్రయించడం మొదలుపెట్టారు ఇక్కడి సిబ్బంది. ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు చేపట్టి.. సూపర్‌వైజర్‌ను, సేల్స్‌మాన్‌ని అరెస్టు చేశారు. వారిపై 34A సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ తెలిపారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మిలటరీ మద్యం అమ్మకాలు అనేక విమర్శలకు తావిస్తోంది. మిలటరీ మద్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే షాపులోకి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ మద్యం షాప్‌లో డిఫెన్స్‌ మద్యం దొరకడంపై టీవీ5 కథనాలకు ఎక్సైజ్‌ అధికారులు స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్నారు. షాప్‌లో పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని జిల్లా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరావు అన్నారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారాయన.

ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనూ ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు మద్యం అమ్ముతున్నారని ఇప్పటికే ప్రజల్లో ఆగ్రహం నెలకొంది. ఈ సమయంలో కొందరు సిబ్బంది ఇలాంటి కక్కుర్తి పనులకు పాల్పడుతుండటంతో కొత్త మద్యం పాలసీపై విమర్శలకు తావిస్తోంది.

Tags

Next Story