ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని హతమార్చిన అమెరికా?

ఐసిస్ చీఫ్ అబు బకర్ అల్ బగ్దాదీని.. అమెరికా సైన్యం ఓ రహస్య ఆపరేషన్‌లో మట్టుబెట్టినట్టు సమాచారం. సిరియాలో ఐసిస్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఆపరేషన్‌లో US ఆర్మీ అబూ బకర్‌ను హతమార్చినట్టు అధికారులు తెలిపారని ప్రఖ్యాత పత్రిక న్యూస్ వీక్ తెలిపింది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు వైట్‌హౌస్‌కి నిర్ధారించినట్టు పెంటగాన్‌లోని ఆర్మీ అధికారులు పేర్కొన్నట్టు వార్త ప్రచురించింది.
అబూ బకర్ బగ్దాదీ అంతమయ్యాడని అర్థం వచ్చేలా.. ఇప్పుడే ఓ పెద్ద ఘటన జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే వైట్‌హౌస్ కానీ... అమెరికా అధ్యక్ష వర్గాలు కానీ బగ్దాదీ మృతిపై అధికారిక ప్రకటన చేయలేదు.
ఐసిస్ చీఫ్ బగ్దాదీ అమెరికన్ సైనిక ఆపరేషన్లలో చనిపోయాడని గతంలోను వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ తర్వాత దానిపై ఎలాంటి స్పష్టత రాలేదు. మళ్లీ ఇప్పుడు బగ్దాదీ చనిపోయాడని అమెరికన్ పత్రిక రాయడం చర్చనీయాంశంగా మారింది.
Something very big has just happened!
— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com