శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

X
By - TV5 Telugu |27 Oct 2019 5:30 PM IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ స్మగ్లర్ నుంచి రూ.19 లక్షల విలువ చేసే 506 గ్రాముల గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మహబూబ్ అలీఖాన్ అనే వ్యక్తి.. అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తీసుకెళ్లేలా ఓ ప్లాన్ వేశాడు. బంగారాన్ని కరగదీసి.. ఒక పేపర్లా తయారు చేశాడు. దాన్ని లగేజ్ బ్యాగ్‌లో అడుగున పెట్టుకొని తీసుకొచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు.. స్కానింగ్ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com