క్రికెట్ బెట్టింగ్‌ డబ్బుల కోసం ఫ్రెండ్‌ని అతి కిరాతకంగా..

క్రికెట్ బెట్టింగ్‌ డబ్బుల కోసం ఫ్రెండ్‌ని అతి కిరాతకంగా..

cricket-betting

క్రికెట్ బెట్టింగ్‌ డబ్బుల కోసం స్నేహితుడిని కిరాతకంగా చంపి పూడ్చిపెట్టాడు మిత్రులు. ఈ ఘటన హైదరాబాద్‌ మణికొండలో తీవ్ర కలకలం రేపింది. వారం రోజుల కిందట ఎర్రంశెట్టి అరుణ్‌కుమార్‌ అదృశ్యమైయ్యారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు అరుణ్‌ కుమార్‌ మిత్రులపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ దారుణం బయటకు వచ్చింది. అరుణ్ కుమార్‌ను స్టేప్ని రాడ్‌తో కొట్టి చంపి వికారాబాద్‌ అడవుల్లో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు .

మణికొండకు చెందిన అరుణ్ కమార్‌, నగష్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే అక్టోబర్ 23న అరుణ్ కుమార్ కనిపించడం లేదని అతడి సోదరుడు రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తన తమ్ముడిని అతడి స్నేహితుడు నగేశ్ తన స్వస్థలం వికారాబాద్‌లోని యాలాల్‌ తీసుకెళ్లాడని.. ఆ తర్వాత తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు అరుణ్‌కమార్ మిత్రుడు నగష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. IPL మ్యాచ్‌ బెట్టింగ్‌ లో అరుణ్‌ కుమార్ తనకు రూ.70 వేలు భాకీ ఉన్నాడని పేర్కొన్నాడు. ఆ డబ్బుల కోసమే అరుణ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. యాలాల్‌కు కారులో వెళ్తున్న సమయంలో గొడవ జరిగిందని.. దీంతో కారులో ఉన్న స్టేప్ని రాడ్‌తో కొట్టానని భయంలో ఆస్పత్రికి తీసుకెళ్దామనుకునే లోపు చనిపోయాడని నేరాన్ని అంగీకరించాడు.

కొడంగల్‌లో అరుణ్ మృతదేహాన్ని పాతిపెట్టామని నగేశ్ చెప్పాడు. దీనికి అతడి బావ శ్రీనివాస్ సహకరించినట్లు వెల్లడించాడు. బీజాపూర్ జాతీయ రహదారి కొత్తగా నిర్మితమవుతున్న టోల్ గేట్ సమీపంలో అరుణ్ మృతదేహాన్ని పాతిపెట్టారు. మణికొండ సీఐ ఆధ్వర్యంలో పూడ్చిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టానికి కోడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితులిద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story