కన్న పిల్లలను నరికి చంపి..

జనగామ జిల్లా నర్మెట్ట మండలం శివభూక్య తండాలో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలను కత్తితో నరికి చంపిన తల్లి... ఆ తర్వాత తాను కూడా మెడ కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు.

శివభూక్య తండాకు చెందిన రమకు.. వరుణ్, భానుశ్రీ అని ఇద్దరు పిల్లలున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాల వల్లే కొన్ని రోజులుగా ఈ కుటుంబం ఇబ్బందులు పడుతోంది. విరక్తితోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే రమ బంధువులు మాత్రం భర్త వేధింపులే కారణమని ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story