వైసీపీ నాయకుడిపై మహిళ ఫిర్యాదు..తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని వివాహిత ఆరోపణ

వైసీపీ నాయకుడిపై మహిళ ఫిర్యాదు..తన కోరిక తీర్చాలంటూ వేధిస్తున్నాడని వివాహిత ఆరోపణ
X

ప్రకాశం జిల్లాలో అధికార పార్టీ నేతల కక్షసాధింపు చర్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆర్‌.ఉమ్మడివరంలో కొందరు వైసీపీ నాయకులు దళితులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పొలం వివాదంలో 100మంది వచ్చి దాడి చేసినట్టు బాధితుల ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ లీడర్లు.. దళితులపై మళ్లీ దాడికి దిగారు. మహిళలను కూడా గాయపరిచారు.

కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైసీపీ-టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, కొడవళ్లతో దాడులకు దిగారు. 11 మందికి గాయాలయ్యాయి. పాతకక్షల కారణంగానే వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడు పేటలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఆరుగురు గాయపడ్డారు. వీధి కుళాయి మరమ్మతుల విషయంలో వివాదం తలెత్తింది. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్, వైసీపీ నాయకుల మధ్య మొదలైన గొడవతో ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి.

అనంతపురం జిల్లా ఈదుల బలపురంలో స్థానిక వైసీపీ నాయకుడు ఆదినారాయణరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసింది ఓ మహిళ. తన కోరిక తీర్చాలంటూ 15 రోజుల నుంచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వాయిపోయింది. తన భర్తను ఓ ఇంటిలో బంధించి అత్యాచారం చేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దురుద్దేశంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని అంటున్నాడు ఆదినారాయణరెడ్డి.

Tags

Next Story