సోషల్ మీడియా పిచ్చితో.. పోయిన ప్రాణం

సోషల్‌ మీడియా పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ.. దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌, వాట్సప్, టిక్‌టాక్‌ వంటి యాప్‌ల్లో పెట్టేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలకు గురై.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

కొంత మంది ఫ్రెండ్స్‌ గ్రూప్ ఒకచోట చేరి బైక్‌తో రోడ్డుపక్కన స్టంట్స్ చేస్తున్నారు.. ఓ వ్యక్తి బైక్‌ను రౌండ్‌గా తిప్పుతూ స్టంట్స్ చేస్తున్నాడు. ఇంతలోనే బైక్‌ అదుపుతప్పి రోడ్డుపైకి వెళ్లింది.. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ వాహనం వేగంగా బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో స్టంట్స్ చేస్తున్న ఆ యువకుడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story