ప్రభాస్‌ని పెళ్లి చేసుకుంటా.. కాజల్ షాకింగ్ కామెంట్స్


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆరడుగుల అందగాడు ప్రభాస్. బాహుబలితో ప్రభంజనాన్నే సృష్టించాడు. సాహో కలెక్షన్లతో రికార్డులు నెలకొల్పాడు. సినిమా ప్రమోషన్లో కనిపించినా, మరెక్కడ కనిపించినా ప్రభాస్‌ని పెళ్లెప్పుడు అని అడిగే వారి సంఖ్య ఎక్కువైంది. టైమ్ వస్తే ఆగదంటూ దాటవేసే ప్రభాస్‌ని నేను పెళ్లి చేసుకుంటా అని అంటోంది ముద్దుగుమ్మ కాజల్. ఎలాగూ నాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. మా చెల్లి నిషా అగర్వాల్‌కి పెళ్లై పిల్లాడు కూడా పుట్టేసాడు అని అనుకుంది కాబోలు.. మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ స్టార్స్‌కి కాజల్ గెస్ట్‌గా వెళ్లింది. కబుర్లు, కాలక్షేపంతో సరదగా సాగుతున్న ఆ ప్రోగ్రాంలో మంచు లక్ష్మీ.. రామ్ చరణ్, తారక్, ప్రభాస్‌లలో ఎవరిని చంపుతారు? ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉంటారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించగా.. కాజల్ స్పందిస్తూ.. రామ్ చరణ్‌ని చంపేస్తానని, ఎన్టీఆర్‌తో రిలేషన్‌లో ఉంటానని, ప్రభాస్‌ను మాత్రం పెళ్లి చేసుకుంటానని చెప్పింది. రామ్ చరణ్‌కి, ఎన్టీఆర్‌కి పెళ్లై పోయింది. ఖాళీగా ఉంది ప్రభాసే కదా అతడ్నే పెళ్లి చేసుకుంటానంటోంది ఈ చందమామ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

