అంతర్జాతీయం

దేశ ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తున్నా : కేటీ హిల్

దేశ ప్రయోజనాల కోసం రాజీనామా చేస్తున్నా : కేటీ హిల్
X

KETI

అమెరికన్ కాంగ్రెస్ లో పనిచేస్తున్నడెమొక్రటిక్ పార్టీ సభ్యురాలు కేటీ హిల్ తన పదవికి రాజీనామా చేశారు. తనవద్ద పనిచేస్తున్న ఓ ఉద్యోగితో శారీరక సంబంధం కల్గిఉందనే ఆరోపణ కారణంగా ఎథిక్స్ కమిటీ విచారణ నేపధ్యంలో ఆమె పదవి నుంచి తప్పుకున్నారు. 2018 నవంబర్ లో కాలిఫోర్నియా నుంచి us కాంగ్రెస్ కు ఎన్నికైన 32 ఏళ్ల కేటి హిల్.. దేశం, తమప్రాంత ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ లో పోస్టు చేశారు. తన భర్తతో విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో తనపై దుష్ర్పచారం జరుగుతోందని ఆమె మండిపడ్డారు. తన అభ్యంతరకర ఫోటోలు విడుదలచేసిన మీడియాపై చట్టపరమైన చర్యలు చేపడుతానని అన్నారు.

Next Story

RELATED STORIES