నెల క్రితమే ప్రేమ పెళ్లి.. భార్యను తనతో పంపించాలంటూ..

నెల క్రితమే ప్రేమ పెళ్లి.. భార్యను తనతో పంపించాలంటూ..
X

celltower

ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారి పాలెంలో ఓ యువకుడు సెల్‌టవర్‌ ఎక్కి హల్ చల్ చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని.. తన నుంచి విడదీశారనే మనస్తాపంతో ఇలా సెల్‌ టవర్‌ ఎక్కాడు. యువతిని తనతో పంపించే వరకు సెల్‌ టవర్‌ నుంచి దిగేది లేదంటున్నాడు. గుంటూరుకు చెందిన నామాల చందు.. అన్నంబొట్లవారి పాలెంకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ యువతి తనను చందు వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నెల తిరక్కుండానే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. దీంతో యువతి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు చందు. ఈ క్రమంలో తన భార్యను తనతో పంపించాలంటూ సెల్‌ టవర్‌ ఎక్కి నిరసన తెలిపాడు. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని అతనికి నచ్చజెప్పి కిందకు దించే ప్రయత్నం చేశారు.

Tags

Next Story