మెగా ఫ్యామిలీ అంటే అర్థం.. : వర్మ కామెంట్

మెగా ఫ్యామిలీ అంటే అర్థం.. : వర్మ కామెంట్
X

కమ్మరాజ్యంలో కడప రెడ్లు.. ఏది ఏమైనా ఇలాంటి టైటిల్ పెట్టి సినిమా చేయాలంటే అది వర్మకు మాత్రమే సాధ్యం. సరదాగానో, సీరియస్‌గానో కాసేపు తన గురించి మాట్లాడుకునేలా చేస్తాడు ఆర్జీవీ. అదే రామ్ గోపాల్ వర్మ స్పెషాలిటీ. ఎవరికీ రాని ఆలోచనలన్నీ ఆయనకే వస్తాయి. తాజాగా మెగా ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీతో పాటు, అభిమానులు మాట్లాడుకునేది చిరంజీవి గురించి ఆయన వారసులుగా వస్తున్న వారి గురించి.. కానీ వర్మ మాత్రం మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి ఫ్యామిలీ అని ఎందుకనుకుంటారు.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటే దాన్ని మెగా ఫ్యామిలీ అంటారని అందులో దాగున్న అర్థాన్ని వివరించారు. ఆ పేరుతో సినిమా తీస్తానని ప్రకటించారు. మళ్లీ అంతలోనే ఏమైందో అదంతా తూచ్.. నేను ఆ పేరుతో సినిమా తీయట్లేదోచ్ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు. మెగా ఫ్యామిలీలో వర్మ ఏం చూపిస్తాడో అని ఆసక్తిగా ఎదురు చూసే అభిమానులను నిరాశపరిచారు.

Next Story