ఆటో డ్రైవర్లకు రూ.10,000.. దరఖాస్తు గడువు మరో రెండు రోజులు..

ఆటో డ్రైవర్లకు రూ.10,000.. దరఖాస్తు గడువు మరో రెండు రోజులు..
X

autos

ఆర్థికంగా వెనుకబడిన ఆటో డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటో ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు ముగిసిపోయినా వారికి మరో అవకాశం కల్పించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్‌ఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభోత్పవంలో దరఖాస్తు గడువు అక్టోబర్ 31వ తేదీ అని ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.10,000 ఆర్థిక సాయం లభిస్తుంది. సొంత ఆటో ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుంది. రెండు ఆటోలున్నా ఒక్క వాహనానికి మాత్రమే ఆర్థిక సాయం లభిస్తుంది. ఒకే ఇంట్లో రెండు వాహనాలు వేర్వేరు వ్యక్తుల పేరు మీద ఉన్నా ఒక్కరికే సాయం అందుతుంది. ఆటో డ్రైవర్‌కు ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నెంబర్‌ను వెహికల్ లైసెన్స్‌తో లింక్ చేయాలి. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే అర్హులనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Next Story