పలు కీలక పథకాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్

కొత్తగా అమల్లోకి రానున్న పలుకీలక పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ప్రతిష్టాత్మకమైన అమ్మ ఒడి పథకానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రామీణ నియోజవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విత్తనాలు, ఎరువులను ల్యాబ్‌లో పరీక్షించి రైతులకు అందజేయనున్నారు. రెట్టింపు పోషకాహారం అందించే పైలట్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 77 మండలాల్లో 90 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
టీటీడీ మినహా ఇతర దేవాలయాల ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకానికి అవసరమైన చట్టసవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా-గోదావరి కెనాల్స్ క్లీనింగ్ కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులను రద్దు చేసింది మంత్రివర్గం. విశాఖలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కోసం లులూగ్రూప్నకు కేటాయించిన 13.6 ఎకరాలు రద్దు చేశారు. జగ్గయ్యపేటలో రసాయన కర్మాగారం కోసం గతంలో కేటాయించిన 498 ఎకరాల భూ కేటాయింపును కూడా రద్దుచేశారు. ఇక ఏపీలో ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com