ఏసీబీ అధికారులపై ఏపీ ఉప ముఖ్యమంత్రి ఫైర్

ఏసీబీ  అధికారులపై ఏపీ ఉప ముఖ్యమంత్రి ఫైర్
X

ap-deputy-cm

ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ACB అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. అవినీతి నిరోధించాల్సిన శాఖలో కొందరు అధికారులు దోపిడీ దొంగల్లా తయారయ్యారంటూ ఫైర్ అయ్యారు. ఏసీబీ అధికారుల పని తీరు చూస్తుంటే అసహ్యం వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖ మధురవాడ రిజిస్టార్ కార్యాలయంలో సబ్‌ రిజిస్టార్‌ను ఇరికించబోయి.. ఏసీబీ అధికారులే ఆ వలలో చిక్కుకోవటం .. ఆ వివాదం తన వద్దకు రావటంతో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. అటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ రేంజ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల డీఐజీ రవీంద్రనాథ్‌కు కూడా ఏసీబీ అధికారులతో లాలూచీ ఉందన్నారు...ఆయనపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు..

ఈ నెల 9న మధురవాడ సబ్‌ రిజి స్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లింది ఏసీబీ బృందం . ఆ సమయంలో పర్మిషన్‌పై ఇంటికి వెళ్లిపోతున్న సబ్‌ రిజిస్ట్రార్‌ టి.తారకేష్‌ను ఏసీబీ సీఐ గఫూర్‌ ఆపి.. కార్యాలయంలో కూర్చోబెట్టారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ రంగరాజు అక్కడకు చేరుకుని బయట గేటును మూయించివేసి కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అయితే, ఎక్కడా డబ్బు దొరకలేదు. ఆ తర్వాత సీఐ గఫూర్‌ బయటకు వెళ్లి రూ.61 వేల 500 నగదును తీసుకొచ్చి అక్కడే దొరికినట్లు కేసు పెట్టే ప్రయత్నం చేశారు. ఇదంతా సీసీ కేమెరాల్లో రికార్డు అయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మొత్తం వీడియోలను డిప్యూటీ సీఎం బోస్ ముందుంచారు.

Tags

Next Story