కార్చిచ్చు.. మ్యూజియాన్ని చుట్టుముట్టిన బడబాగ్ని

కాలిఫోర్నియా కార్చిచ్చు ఇంకా అదుపులోకి రాలేదు. రోజురోజుకూ మంటలు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే లాస్ ఏంజిల్స్‌తో పాటు శివారు ప్రాంతాలకు దావానలం వ్యాపించింది. అక్కడ 593 ఎకరాల విస్తీర్ణంలోని భూభాగం కాలి బూడిదైపోయింది. దాదాపు 10 వేల ఇళ్లు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ లిబ్రోన్, హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజ్ నెగ్గర్ తదితరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రఖ్యాత జెట్టీ మ్యూజియాన్ని కూడా బడబాగ్ని చుట్టుముట్టింది. ఐతే, మ్యూజియంలోని కళాకృతులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఫైర్ రెసిస్టెంట్ టెక్నాలజీ సాయంతో కళాకృతులను భద్రపరించారు.
సోనోమా, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లోనూ కార్చిచ్చు ప్రభావం కనిపిస్తోంది. దావాగ్ని దెబ్బకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందలాది ఇళ్లు కాలిపోయాయి. నగరంలోని పాఠశాలలు, ప్రముఖ రహదార్లను మూసివేశారు. బలమైన వేడి గాలులు వీస్తుండడంతో బడబాగ్ని తీవ్రత మరింత ఉద్ధృతమవుతోంది. మంటలను అదుపు చేయడానికి వేలాదిమంది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. నవంబర్ 7 నాటికి మంటలు అదుపులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com