వణికిస్తున్న డెంగ్యూ

వణికిస్తున్న డెంగ్యూ

dengu

తెలంగాణ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. రోగులు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మిషనరీ ఆసుపత్రిలో సీను చూస్తే డెంగ్యూ కేసులు ఏ స్తాయిలో ఉన్నాయో అద్దం పడుతుంది. ఆసుపత్రిలో బెడ్లు నిండిపోయాయి. ఇతర విభాగాల్లో కూడా డెంగ్యూ రోగులకే చికిత్స అందిస్తున్నారు. అయినా కేసులు తగ్గడం లేదు. పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. మిషనరీ ఆసుపత్రి యాజమాన్యం వారికి వెనక్కు పంపలేక.. చికిత్స అందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. చివరకు బెడ్లు లేకపోవడంతో ఆవరణలో చెట్ల కింద పెద్ద పెద్ద గొడుగులు ఏర్పాటు చేసి వాటికిందనే రోగులను కూర్చోబెట్టి చికిత్స అందిస్తున్నారు.

కొడంగల్, తాండూరు, పరిగి పట్టణాల నుంచి పెద్ద ఎత్తున వికారాబాద్ మిషనరీ ఆసుపత్రికి రోగులు వస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టకుని వస్తున్న వారిని తిరిగి పంపలేక... చెట్ల కింద వైద్యం ఏర్పాటు చేసినట్టు హాస్పిటల్ సిబ్బంది చెబుతున్నారు. డెంగ్యూ కేసుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే.. ప్రాణాలకే ప్రమాదం అందుకే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు.

మరోవైపు మంచిర్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురిని బలి తీసుకుంది. వందలాది మంది ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, మిషనరీ ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. రోజురోజుకు విజృంభిస్తున్న డెంగీ వ్యాధి కారణంగా ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేక.. గొడుగుల కింద వైద్యం అందించాల్సిన దుస్థితి వచ్చింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్రైస్తవ మిషనరీ హాస్పటల్లో రోజురోజుకు డెంగు రోగులు అధికమవడంతో ఆసుపత్రిలో స్థలం సరిపోక గొడుగుల కింద రోగులకు చెట్టు కొమ్మలకు సిలైన్ బాటిల్స్ కట్టి వైద్యం అందించడం జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story