నీట మునిగిన ఒంగోలు

నీట మునిగిన ఒంగోలు
X

rain

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులో ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారింది. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురవడంతో నగరం జలమయమైంది. జనజీవనం స్తంభించి పోయింది. రహదారులు వాగులను తలపించాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు రావడంతో వాటిని బయటకు తోడుకునేందుకు ప్రజలు శ్రమించారు. అదే సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. ఒంగోలు మండలంతో పాటు సమీపంలోని సంతనూతలపాడు, కొత్తపట్నం, టంగుటూరు మండలాల్లో సైతం భారీ వర్షం కురిసింది. ఇదే విధంగా కందుకూరు, కొండపి, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు, చీరాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా జోరుగా వర్షం కురిసింది. పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలో ఓ మోస్తారు వర్షం కురిసింది.

Tags

Next Story