పోస్టాఫీస్‌లో నెలకు రూ.5,000 జమ చేస్తే.. 3 లక్షల 60 వేలు..

పోస్టాఫీస్‌లో నెలకు రూ.5,000 జమ చేస్తే.. 3 లక్షల 60 వేలు..
X

post-office

వచ్చినదంతా ఖర్చయిపోతుంది. భవిష్యత్ అవసరాలకు భద్రత నిచ్చే పెట్టుబడి బ్యాంకులకంటే వడ్డీ ఎక్కువ వచ్చే స్కీమ్ ఏదైనా ఉందా అని ఆరా తీస్తే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉందని తెలిసింది. స్థిర వడ్డీరేటు పొందాలని భావించే వారికి ఆర్‌డీ మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధి ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీస్‌కి వెళ్లి ఆర్‌డీ అకౌంట్‌ని తెరవచ్చు. ఇక్కడ ఐదేళ్ల కాలం వరకు డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో కన్నా ఇక్కడ వడ్డీ రేటు ఎక్కువగా వస్తుంది. బ్యాంకుల్లో 6.25 శాతం ఉంటే.. పోస్టాఫీసుల్లో అయితే 7.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఒకవేళ మీరు నెలకు రూ.750లే పెట్టుబడి పెట్టారనుకోండి చివరలో రూ.54,000 మీ చేతికి వస్తాయి. అదే రూ.5000 పెట్టినట్లైతే మెచ్యూరిటీ సమయంలో రూ.3.6 లక్షలు వస్తాయి. పోస్టాఫీస్ ఆర్‌డీ అకౌంట్‌లో వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి జమ అవుతూ వస్తుంది. దీంతో కాంపౌండింగ్ ప్రయోజనం వల్ల మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ రాబడి వస్తుంది. ఆర్‌డీ అకౌంట్ ప్రారంభించినప్పుడు వడ్డీ ఎంత వుందో చివరి వరకు అదే వడ్డీ కొనసాగుతుంది.

Next Story