రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఓటీపీ చెబితే టికెట్ డబ్బులు వాపస్..

రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. ఓటీపీ చెబితే టికెట్ డబ్బులు వాపస్..
X

train-tickets

రైల్వే ప్రయాణికులకు తీపి కబురు. ఇకపై ట్రైన్స్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఓటీపీ ఆధారంగా వెంటనే మీ డబ్బు మీ అకౌంట్లో జమ అవుతుంది. ఐఆర్‌సీటీసీ ఈ కొత్త ఓటీపీ ఆధారిత రిఫండ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ సారథ్యంలోని ఇండియన్ రైల్వేస్ ఈ వ్యవస్థను ఆవిష్కరించింది.

అయితే ఈ సిస్టమ్ ఐఆర్‌సీటీసీ అధికారిక ఏజెంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వీరి ద్వారా బుక్ చేసుకున్న టికెట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ విధానంలో ప్రయాణికుల రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ వద్దనుకున్నా వారికి ఎస్‌ఎంఎస్ రూపంలో ఓటీపీ వస్తుంది. దీంతో పాటు రిఫండ్ అమౌంట్ వివరాలు కూడా వస్తాయి. అది ఏజెంట్లకు చూపిస్తే వెంటనే డబ్బు వాపస్ ఇచ్చేస్తారు.

టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రయాణికులు గుర్తుంచుకోవలసిన విషయాలు..

మొబైల్ నెంబర్ సరిగ్గా చెప్పాలి. బుకింగ్ సమయంలో ఏజెంట్లు సరిగా ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకోవాలి. ఇ-టికెట్లకు మాత్రమే ఓటీపీ రిఫండ్ రూల్స్ వర్తిస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త ఓటీపీ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుందని, ఎంత రిఫండ్ వస్తుందో వెంటనే తెలిసి పోతుందని అధికారులు తెలియజేస్తున్నారు.

Next Story