భారీ వర్షాలు.. స్కూళ్లకు కాలేజీలకు సెలవు..

భారీ వర్షాలు.. స్కూళ్లకు కాలేజీలకు సెలవు..
X

tamilnadu

ఆకాశానికి చిల్లు పడినట్లుగా రోజూ వర్షాలు కురుస్తున్నాయి. స్కూలుకు వెళ్లే పిల్లలు, కాలేజీలకు వెళ్లే విద్యార్ధులు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాట కురుస్తున్న కుండపోత వానలకు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. మధురై, తిరునల్వేలి, తిరువళ్లూరు, తూత్తుకుడి, విరుదునగర్, తేని, రామనాథపురం, వెల్లూరు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. 8 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 30న సెలవు ప్రకటించింది.

Next Story