నిన్నటి కంటే ఈరోజు బంగారం ధరలో..

పసిడి ధరలో హెచ్చుతగ్గులు.. ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియని పరిస్థితి. నిన్న పెరిగింది. ఈరోజు తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.320 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,880కు క్షీణించింది. కొనుగోలు దారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగార ధరపై ప్రతికూల ప్రభావం పడుతోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర వచ్చి రూ.36,530 పలుకుతోంది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా రూ.400 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,500 దిగివచ్చింది. ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గింది. దీంతో ధర రూ.38,500కు దిగివచ్చింది. 22 క్యారెట్ల ధర రూ.37,300కు క్షీణించింది. వెండి ధర రూ.400 తగ్గి రూ.48,500 పలుకుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com