అర్జంట్‌గా రమ్మంటూ అంబులెన్స్‌కి ఫోన్.. తీరా వచ్చి చూస్తే..

అర్జంట్‌గా రమ్మంటూ అంబులెన్స్‌కి ఫోన్.. తీరా వచ్చి చూస్తే..
X

sunil

నువ్వెంత అంటే నువ్వెంత అని ఇరుగు పొరుగు పోట్లాడుకున్నారు. మధ్యలో మేకకు వచ్చాయి తిప్పలు.. పాపం దాన్ని చావబాదేసరికి అది తీవ్రంగా గాయపడింది. దాంతో మేకను పెంచుకున్న యువకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే తన దగ్గర ఉన్న అంబులెన్స్ నెంబర్‌కి ఫోన్ చేసి అర్జంట్‌గా రండి.. మత్యువుతో పోరాడుతోంది అని ఫోన్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్‌గంజ్ జిల్లాలోని హరియా థెట్రా గ్రామానికి చెందిన సునీల్ మినీవ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడు ఇంట్లో ఓ మేకను పెంచుకుంటున్నాడు. పొరుగింటి వారు తమ పెరట్లోని మొక్కలన్నీ మేక తినేస్తుందని సునీల్‌తో గొడవకు దిగారు. అంతటితో ఆగక మేకను చితకబాదారు. గాయపడిన మేకను చూసి సునీల్ తల్లడిల్లిపోయాడు. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చి పేషెంట్ ఎక్కడ అని అడిగారు. సునీల్ మేకను చూపించేసరికి షాకయ్యారు. మనుషుల కోసం ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ ఇది.. జంతువుల కోసం కాదు అంటూ అతడిని మందలించారు. తరువాత దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది.

Next Story