మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
X

STS_5478

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణ బాధ్యతల నుంచి సింగపూర్ కన్షార్షియాన్ని తప్పించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ కన్షార్షియంతో ఒప్పందం రద్దుచేసుకున్నట్టు వెల్లడించారు. పరస్పర అంగీకారంతోనే ఈ ప్రాజెక్టు రద్దయిందని చెప్పారు.

రాజధాని వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి తమ వద్ద సాక్ష్యాధారాలున్నాయన్నారు. కేపిటల్ కడతామని ప్రకటించి గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు బొత్స. రాజధాని నిర్మాణం కోసం 50 అంతస్తుల భవనం ఎందుకు అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ కూడా భవనాలు లేవన్నారు. ఒక్క పనికి కూడా పాలానపరమైన అనుమతి తీసుకోలేదన్నారు. అనుభవం లేనివారికి పనులు కట్టబెట్టారని విమర్శించారు.

అమరావతి రాజధాని కోసం గత ప్రభుత్వం రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమిని తీసుకుంది. సింగపూర్ కన్సార్షియంతో రాజధాని నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానిపై అస్పష్ట ప్రకటనతో ప్రజల్ని గందరగోళంలోకి నెట్టింది. ఇప్పుడు సింగపూర్ కన్షార్షియాన్ని తప్పించడంతో ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి ఫుల్‌స్టాఫ్‌ పడినట్లేనని తెలుస్తోంది.

Tags

Next Story