ఆ ఎద్దు పేడని అత్తాకోడళ్లిద్దరూ రోజూ..

అత్తాకోడళ్లిద్దరూ ఆ ఎద్దు ఎప్పుడు పేడ వేస్తుందా అని రోజూ ఎదురు చూస్తున్నారు. ఈ సారైనా తమ 4 తులాల బంగారం బయటకు వచ్చిందా లేదా అని పేడలో చూస్తున్నారు. దాదాపు పది రోజులుగా ఇదే పని. హర్యానాలోని సిర్పాలో జనక్‌రాజ్ భార్యా, కొడుకు కోడలితో నివసిస్తున్నారు. అత్తా కోడళ్లిద్దరూ కబుర్లాడుకుంటూ వంట చేస్తున్నారు. దీపావళి పండగ వస్తుందని ఇంట్లో సామానుతో పాటు బీరువాలోని నగల్ని కూడా శుభ్రం చేయాలనుకున్నారు. నగల మూటని బయటకు తీసి పక్కన ఉంచారు. వంట పని అయ్యాక శుభ్రం చేయాలనుకున్నారు. వంటకని కూరలు తరిగి, వాటి చెక్కులను ఎద్దుకు వేద్దామని పక్కన పెట్టారు. వంట చేయడానికని వంటగదిలోకి వెళ్లారు ఇద్దరూ. ఇంతలో ఎక్కడినుంచో వచ్చిన ఎద్దు ప్లేట్లో ఉన్న కూరగాయల తొక్కల్ని, పక్కనే ఉన్న బంగారం మూటని తినేసింది. బయటకు వచ్చి చూసుకున్న అత్తగారికి బంగారం మూట కనిపించపోయేసరికి ఎద్దు పనే అయిఉంటుదని అనుమానిస్తున్నారు. అందుకే ఎద్దు వేసే పేడ కోసం ఎదురు చూస్తున్నారు. పశువుల డాక్టర్ సలహా మేరకు ఎద్దుని వాళ్ల పెరట్లోనే కట్టేసారు. బంగారం బయటకు వచ్చాకే ఎద్దు ఓనర్‌కి దాన్ని అప్పగిస్తామంటున్నారు. ఒక్కోసారి ఆవులు, గేదెలు ప్లాస్టిక్ వ్యర్ధాలు లాంటివి తిన్నా అవి వాటి కడుపులోనే పేరుకుపోతాయి. ఆపరేషన్ చేసి లోపలి వ్యర్ధాలను బయటకు తీయాల్సి ఉంటుంది. మరి ఈ బంగారం కూడా పేడలో వచ్చేస్తే ఓకే. లేదంటే ఆపరేషన్ చేసి తీయాల్సి ఉంటుందని డాక్టర్ అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com