ఇసుక సత్యాగ్రహం చేస్తాం : మాజీ మంత్రి మాణిక్యాలరావు

ఇసుక సత్యాగ్రహం చేస్తాం : మాజీ మంత్రి మాణిక్యాలరావు
X

manikyalarao

వారంరోజుల్లో సామాన్యులకు ఇసుక అందుబాటులోకి తీసుకరాకపోతే.. ఇసుక సత్యాగ్రహం చేస్తామని మాజీ మంత్రి, బీజేపీ నాయకులు మాణిక్యాలరావు హెచ్చరించారు. అనంతపురంలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీశైలం నుంచి వరదను రాయలసీమలో చెరువులు నింపడానికి అవకాశం ఉన్నా..

సముద్రంలోని వదిలిన అసమర్ధ ప్రభుత్వం ఇదన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ప్రజావిశ్వాసం కోల్పోయిందన్నారు. ఇసుక కొరత తీర్చేంత వరకూ భవన నిర్మాణ కూలీలకు ప్రభుత్వమే ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు మాణిక్యాలరావు.

Tags

Next Story