వైద్యశాఖా అధికారుల్లో కదలికలు

వైద్యశాఖా అధికారుల్లో కదలికలు

de

వికారాబాద్‌లోని మిషనరీ ఆస్పత్రిలో డెంగీ రోగులకు అందిస్తున్న వైద్యంపై మీడియాలో కథనాలు రావడంతో ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు. వికారాబాద్‌ డీఎంహెచ్‌వో సుధాకర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో జీవరాజ్‌, జిల్లా మలేరియా అధికారి బ్రెజిలిల్‌ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కోరారు. అయితే, అందుకు నిరాకరించిన రోగులు అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుతిరిగారు.

కొద్ది రోజులుగా వికారబాద్‌లో డెంగ్యూతో బాధపడుతున్న వందలాది మంది రోగులు మిషనరీ ఆస్పత్రిలోనే వైద్యసాయం పొందుతున్నారు. వచ్చినవారిని తిప్పి పంపలేక ఆస్పత్రి యాజమాన్యం చికిత్స అందిస్తోంది. దీంతో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆస్పత్రిలో పరిస్థితిపై టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో కదిలిన అధికారులు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందడం లేదని, ఈ కారణంగానే మిషనరీ ఆస్పత్రికి వస్తున్నామని రోగులు అధికారులకు తెలిపారు.

రోగులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో గొడుగుల కిందే ఏర్పాటు చేసినట్లు మిషనరీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెబుతున్నారు. ఇవి కూడా చాలకపోతే టెంట్లు ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందిస్తామని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story