ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

JOB

విదేశాలలో ఉద్యోగాలిప్పిస్తామని నమ్మ బలికింది. ఇంటర్వ్యూలు కూడా నిర్వహించింది. ఇలా నిరుద్యోగ యువకుల నుంచి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి చివరకు బోర్డు తిప్పేసింది. వరంగల్‌ నగరంలోని ట్రిమ్‌ విజన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ చేసిన ఈ మోసానికి బలైన నిరుద్యోగులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

వరంగల్‌ నగరం దేశాయిపేట రోడ్‌లో ఉన్న ట్రిమ్‌ విజన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ.. దుబాయిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను నమ్మించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంతో మంది యువతీయువకుల నుంచి సంస్థ అధికారులు డబ్బులు వసూలు చేశారు. ఇంటర్వ్యూల పేరుతో మొదటి విడతగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 వేల రూపాయలు వసూలు చేసి.. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ వచ్చిన తర్వాత మరో 40 వేలు ఇవ్వాలని హామీ పత్రాలు రాయించుకున్నారు. అయితే.. డబ్బులు కట్టి చాలా రోజులు కావస్తున్నా ఎటువంటి స్పందన కనిపించకపోవడంతో బాధితులు కంపెనీ అధికారులను నిలదీశారు. దీంతో.. సంస్థ అసలు రంగు బయటపడింది. మోసపోయామని గ్రహించిన బాధిత నిరుద్యోగ యువకులు సంస్థ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

Tags

Read MoreRead Less
Next Story