ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనాలా లేదా అనేది ఆలోచిస్తాం : పవన్‌ కల్యాణ్‌

ఆర్టీసీ ఉద్యమంలో పాల్గొనాలా లేదా అనేది ఆలోచిస్తాం : పవన్‌ కల్యాణ్‌

pawankalyan

ప్రభుత్వం స్పందించకపోతే.. ఆర్టీసీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలా లేదా అనేది ఆలోచిస్తానన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఆర్టీసీ జేఏసీ నేతలు ఆయన్ను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన... 27 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతోందని, ఆవేదనతో కార్మికుల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తెలంగాణ వచ్చి కూడా రాష్ట్రం ఒక కొలిక్కి రాకుండా అయిపోయిందన్నారు. కేసీఆర్‌ 48 వేల మంది కార్మికులను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ అపాయింట్‌ కోరాతానన్నారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావులను సైతం కలుస్తానన్నారు పవన్‌. కేకేతోనూ ఈ అంశంపై మాట్లాడతానన్నారు. సీఎం కేసీఆర్‌ ఎందుకు ఇంత కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు పవన్‌ కల్యాణ్‌. ప్రభుత్వానికి పట్టు విడుపులు ఉండాలని సూచించారు పవన్‌.

Tags

Read MoreRead Less
Next Story