ఆ ఘనత మోదీ సర్కార్‌దే: కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాలా

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌ను భారత్‌లో పూర్తిగా విలీనం చేసిన ఘనత మోడీ సర్కారుదేనని కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాలా అన్నారు. హైదరాబాద్ బేగంపేటలోని వెల్కిన్ పార్క్‌లో సర్దార్ పటేల్ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ రామచందర్ రావు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్దార్ జయంతి సందర్భంగా వెల్కిన్ పార్క్‌లో పాదయాత్ర నిర్వహించామన్నారు పురుషోత్తం రూపాల. సర్దార్ అడుగు జాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. సర్దార్ దేశాన్ని ఎలా నిర్మించారో అలాగే బలోపేతం చేయాలన్నారాయన.
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ రావు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పేరుతో పటేల్ భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. శ్రేష్ట భారత్‌గా నిర్మాణం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు రామచందర్ రావు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com