అమిత్‌షాను కలిసిన కేటీఆర్

అమిత్‌షాను కలిసిన కేటీఆర్
X

ktr-and-amith-shah

ఢిల్లీ పర్యటనలో మంత్రి కేటీఆర్..కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు. బేగంపేట సమీపంలోని రసూల్‌పుర వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఇంటర్ స్టేట్ పోలీస్ క్వార్టర్స్ కు చెందిన 1. 62 ఎకరాల స్థలాన్ని GHMCకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో స్థలంలో క్వార్టర్స్ నిర్మించి ఇస్తామని అమిషాకు తెలిపారు కేటీఆర్..

అంతకుముందు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన కేటీఆర్.. రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఖమ్మం జిల్లాలో గ్రానైట్ రవాణా కోసం రైల్వే సైడింగ్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నుంచి నల్గొండ మీదుగా హైదరాబాద్ కు రోజువారీ పాసింజర్ రైలు నడపాలని పీయూష్ గోయల్ ను కోరారు కేటీఆర్.

Tags

Next Story