నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 11,500 పోస్టుల భర్తీకి..

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు పోలీసు నియామక మండలి సమాయత్తమవుతోంది. దీనిలో భాగంగా 11,500పైగా పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో 340 సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టులు ఉండగా.. 11,356 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ వెలువడనున్న నేపథ్యంలో పోలీస్ శాఖలోని ఖాళీల వివరాలను ప్రభుత్వానికి అందజేసింది. గత ఏడాది 3 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ జరిగింది. సీఎం జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రకటిస్తానన్నారు. అన్నట్లుగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా 30 శాతం సిబ్బందిని అదనంగా నియమించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించే నియామకాలు చేపట్టనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com