'మీకు మాత్రమే చెప్తా'.. నిర్మాతగానూ విజయ్ దేవరకొండ సక్సెస్

మీకు మాత్రమే చెప్తా.. నిర్మాతగానూ విజయ్ దేవరకొండ సక్సెస్
X

cinema

అర్జున్ రెడ్డితో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. గీత గోవిందం, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో విజయ్ స్టార్ హీరో స్టేటస్‌ని సంపాదించుకున్నాడు. ఇప్పుడు నిర్మాతగానూ కొత్త అవతారం ఎత్తి సక్సెస్ రుచి చూస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా అని ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టి జనాన్ని ఆకర్షించాడు. నిర్మాతగానూ సక్సెస్ అవ్వాలని సినిమా ప్రమోషన్ బాధ్యతలను తలకెత్తుకుని వీడియో సాంగ్ చేసి వినూత్నంగా ప్రచారం చేశాడు. మొత్తానికి ఆడియన్స్‌లో సినిమా పట్ల పాజిటివ్ బజ్‌ని క్రియేట్ చేశాడు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. మరోవైపు హైదరాబాదులో సెలబ్రిటీల కోసం ప్రీమియర్ షో వేశారు. సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా ఆధ్యంతం నవ్వులు పూయిస్తుందని అంటున్నారు. కొన్ని సన్నివేశాల్లో అయతే పొట్ట చెక్కలయ్యే పరిస్థితి వస్తుందని అంటున్నారు. సినిమా పట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందరూ కొత్త వాళ్లే అయినా ఎవరి పాత్రలకు వారు వంద శాతం న్యాయం చేశారని.. దర్శకుడిగా సక్సెస్ అయిన తరుణ్ భాస్కర్ నటుడిగానూ నిరూపించుకున్నారని అంటున్నారు. అభినవ్ గోమఠం కామెడి టైమింగ్, అనసూయ పాత్రలు సినిమాకు హైలెట్ అని చెబుతున్నారు. మొత్తానికి నిర్మాతగా ఓ ప్రయత్నం చేసిన విజయ్ వంద మార్కులు తెచ్చుకున్నాడు అని చెప్పక తప్పదు.

Next Story