విజయ్ దేవరకొండ కౌంటర్లో కూర్చుని టికెట్లు అమ్మేస్తున్నాడోచ్..

విజయ్ దేవరకొండ కౌంటర్లో కూర్చుని టికెట్లు అమ్మేస్తున్నాడోచ్..

vijay

మీకు మాత్రమే చెప్తా.. విజయ్.. నీకు మాత్రమే ఇలాంటి ఐడియాలొస్తాయా.. సినిమా టైటిల్ వెరైటీగా ఉండాలి.. సినిమా ప్రమోషన్ రొటీన్‌కి భిన్నంగా ఉండాలి.. ఇంతా చేసి ఆడియన్స్ రాకపోతే.. హౌస్ ఫుల్ ఎలా అవుతుంది.. అందుకే అక్కడ కూడా విజయ్ తన మార్కుని చూపించాడు.. కౌంటర్లో కూర్చుని టికెట్లు అమ్ముతున్నాడు. విజయ్ దేవరకొండని చూడ్డానికి అమ్మాయిలు, అబ్బాయిలు అంతా క్యూ కట్టేస్తుంటే.. టిక్కెట్ చేతిలో పెట్టి థియేటర్లోకి పంపిస్తున్నాడు.. నవ్వుతూ, జోకులు వేస్తూ, కబుర్లు చెబుతూ మొత్తానికి ఐమాక్స్ థియేటర్లో ఓ సందడి వాతావరణాన్ని విజయ్ క్రియేట్ చేశాడు.

తమ అభిమాన హీరో అర్జున్ రెడ్డి టిక్కెట్లు అమ్ముతున్నాడని తెలిస్తే జనం ఎలా ఊరుకుంటారు. టిక్కెట్లు కొన్నవారికి అద్భుతమైన ఆఫర్లు కూడా ప్రకటించాడు. ఉచితంగా పాప్‌కార్న్ ప్యాకెట్లు అందించాడు. తనకు సినీ లైఫ్ ఇచ్చిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ని హీరోగా పెట్టి విజయ్ దేవరకొండ నిర్మించిన సినిమా కావడంతో అన్నీ తానై నిలిచాడు.. ఈ విధంగా మరోసారి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు దేవరకొండ. మీకు మాత్రమే చెప్తా ప్రేక్షకులకు నవ్వుల నజరానా అందిస్తోందని అంటున్నారు. ఆధ్యంతం కామెడి.. ఆసక్తిదాయకంగా కథను మలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story