'గ్రాండ్‌పా కిచెన్'ని వదిలేసి వంటల తాత వెళ్లిపోయారు..

గ్రాండ్‌పా కిచెన్ని వదిలేసి వంటల తాత వెళ్లిపోయారు..
X

grand-pa

ఓ చేత్తో గరిటె తిప్పగలరు.. మరో చేత్తో మీసం తిప్పగలరు. ఉన్నన్ని రోజులు మంచి రుచికరమైన వంటలు అందించి 60 లక్షల మంది చేత ఔరా అనిపించుకున్నారు తెలంగాణ తాత 73 ఏళ్ల నారాయణ రెడ్డి. ఘుమ ఘులాడే గుత్తి వంకాయ కూర, పులిహోర, చింతకాయ పచ్చడి లాంటి ట్రెడిషినల్ వంటల నుంచి లేటెస్ట్ రుచులు.. మంచూరియా, పిజ్జా, బర్గర్ లాంటి చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ వంటలను అవలలగా వండేస్తారు.. తాత వంటలు తిన్న ప్రతి ఒక్కరు ఆహ! ఏమి రుచి అని అనకుండా ఉండలేరు. అంతబాగా వండగలరు కాబట్టే ఆయన వంటలకు అంతమంది ఫిదా అవుతున్నారు. వంటకు ఆధునిక పరికరాలేవీ ఉపయోగించకుండా కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద పాత్రలు పెట్టి ఈజీగా వండేస్తారు. కేకులు, ఫుడ్డింగులు, మిల్క్‌షేకులు వంటి వాటికి కూడా తాత చేయి పడితే రుచి అమోఘంగా ఉంటుంది. తాత చేతి వంట ఎంత రుచికరంగా ఉంటుందో.. ఆయన మనసు కూడా అంతే. యూట్యూబ్ ఛానెల్ గ్రాండ్‌పా కిచెన్ ద్వారా వచ్చే ఆదాయంతో అనాథలకు బట్టలు, పుస్తకాలు, వారి పుట్టిన రోజుకు కానుకలు అందిస్తుంటారు. అక్టోబర్ 27న తాత కన్నుమూశారు. చనిపోవడానికి వారం రోజుల ముందు కూడా కిచెన్‌లో తాత గరిటె తిప్పారు. తాను మరణించాక కూడా ఛానెల్ ఆపొద్దని సహ ఉద్యోగులకు చెప్పారట నారాయణ రెడ్డి. యూట్యూబ్ స్టార్‌గా మారిన వంటల తాత నారాయణ రెడ్డికి కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన ఫైనల్ జర్నీని యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.

Next Story