టీచర్ మందలించినందుకు టెన్త్ క్లాస్ బాలిక..

టీచర్ మందలించినందుకు టెన్త్ క్లాస్ బాలిక..

student

టీచర్ మందలించినందుకు మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. టాయ్‌‌లెట్ క్లీనింగ్ యాసిడ్ తాగి ప్రాణాలు తీసుకోబోయింది. తోటి విద్యార్థులు వెంటనే వార్డెన్‌కు చెప్పడంతో హుటాహుటిన బాలికను ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న అర్చనకు ఈసారి పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయి. ఫెయిల్ అయ్యింది. దీంతో టీచర్ క్లాస్‌లో నిలదీశారు. సరిగ్గా చదవకపోతే ఎలాగని మందలించారు. దీనికి అర్చన మనస్తాపానికి గురైంది. సూసైడ్ యత్నం చేసింది.

సత్తుపల్లిలోని ఇండిగ్రేటెడ్ బాలికల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న అర్చన బాగానే చదివేదని ఈసారే తక్కువ మార్కులు వచ్చాయని తోటి విద్యార్థులు చెప్తున్నారు. శుక్రవారం యాసిడ్ తాగిన విషయం గుర్తించిన వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story