అమెరికాలో మరోసారి తుఫాకి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి  తుఫాకి కాల్పుల మోత

us-gun-fire

అమెరికా మరోసారి తుఫాకి కాల్పుల మోతతో దద్దరిల్లింది. శాన్ ప్రాన్సిస్కోలోని బే ఏరియాలో నిర్వహించిన హలోవీన్ కార్యక్రమంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత ధనికులు ఉండే ఈ ప్రాంతంలో వందమందికిపైగా హలోవీన్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఓ అగంతకుడు వారిపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలతో ఉలిక్కిపడ్డ వారు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు. వెంటనే అక్కడికిచేరుకున్న పోలీసులు గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story